చికోటి అభ్యర్థనను పరిశీలించాలని సీపీకి హైకోర్టు ఆదేశం

చికోటి అభ్యర్థనను పరిశీలించాలని సీపీకి హైకోర్టు ఆదేశం

క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేశాడు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. రక్షణ కోరుతూ ఈనెల 4 న పోలీసులకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారు స్పందించడంలేదని చికోటి ప్రవీణ్ పిటిషన్ లో పేర్కొన్నారు. చికోటి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రవీణ్ అభ్యర్థనను పరిశీలించాలని హైదరాబాద్ సీపీకి ఆదేశించింది. ఆయన దరఖాస్తుపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసిన న్యాయస్థానం పిటిషన్పై విచారణ ముగించింది. 

క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ తనకు ప్రాణహాని ఉందంటూ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. 2+2 గన్‎మెన్‎లతో రక్షణ కల్పించాలని కోరారు. ప్రవీణ్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల గుర్తించి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చికోటి ప్రవీణ్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రవీణ్‎ను చంపేందుకు కొన్ని తెరవెనుక శక్తులు పనిచేస్తున్నాయని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.