హైదరాబాద్, వెలుగు: జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘నవ నిర్మాణ సభ’ నిర్వహించేందుకు అనుమతి కోరగా, సైబరాబాద్ పోలీసులు నిరాకరించారు.
ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై చేసిన వ్యాఖ్యలు, వాటిపై ఏపీలో నమోదైన కేసులు, పవన్ కల్యాణ్ సహా జనసేన నేతల స్పందనల నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని అనుమతి నిరాకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాంప్రసాద్ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
