సీఎం ఫొటో మార్ఫింగ్‌‌ పై నమోదైన కేసు వివరాలివ్వండి : హైకోర్టు

సీఎం ఫొటో మార్ఫింగ్‌‌ పై నమోదైన కేసు వివరాలివ్వండి : హైకోర్టు
  •     రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌రెడ్డి ఫొటోను మార్ఫింగ్‌‌ చేసి సోషల్‌‌ మీడియాలో పోస్టు చేశారంటూ పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ కావలి వెంకటేశ్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్‌‌ జె.శ్రీనివాసరావు సోమవారం నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేశారు. తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషనర్‌‌ న్యాయవాది వాదించారు.

బీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ 35సీ కింద నోటీసులు జారీ చేయకుండా కేసు నమోదు చెల్లదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఫొటో మార్ఫింగ్‌‌  చర్య సరికాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసిందని గుర్తు చేసింది.కేసుపై పోలీసుల వివరణ నిమిత్తం విచారణను 11కి వాయిదా వేసింది.