ల్యాండ్‌‌ రైట్స్‌‌ సివిల్‌‌ కోర్టులో తేల్చుకోవాలి : హైకోర్టు

ల్యాండ్‌‌ రైట్స్‌‌ సివిల్‌‌ కోర్టులో తేల్చుకోవాలి : హైకోర్టు
  • తీర్పు వెల్లడించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ బంజారాహిల్స్‌‌లోని అత్యంత విలువైన ఏడెకరాల ఆస్తి వివాదంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌‌ చేసింది. ల్యాండ్‌‌ టైటిల్‌‌ వివాదాల పరిష్కారం కోసం సివిల్‌‌ కోర్టును ఆశ్రయించాలని తీర్పు చెప్పింది. ఏవి అసలైన రికార్డులో, ఏ భూమిపై ఎవరికి యాజమాన్య హక్కులు ఉన్నాయో మొదలైన అంశాలను హైకోర్టు తేల్చబోదని, ఆర్టికల్‌‌ 226 కింద అధికారాల ప్రకారం కూడా హైకోర్టులు తేల్చబోవని వెల్లడించింది. 

షేక్‌‌పేట్‌‌ గ్రామం(ప్రస్తుతం బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్‌‌ 4) సర్వే నంబర్‌‌ 396(సవరించిన సర్వే నంబర్‌‌ 225)లోని 7 ఎకరాలకు సంబంధించి దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుంది. వాదనల తర్వాత అన్ని పిటిషన్లను హైకోర్టు డిస్మిస్​ చేసింది.