చినజీయర్‌‌ వ్యాఖ్యలు అబద్ధమని నిరూపిస్తం : హిందూ ధర్మ చక్రం ఫౌండర్

చినజీయర్‌‌ వ్యాఖ్యలు అబద్ధమని నిరూపిస్తం : హిందూ ధర్మ చక్రం ఫౌండర్

పంజాగుట్ట, వెలుగు: జగద్గురువు ఆది శంకరాచార్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన జీయర్ స్వామి వెంటనే క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించాలని హిందూ ధర్మ చక్రం ఫౌండర్ శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో బాలా త్రిపుర సుందరి మఠం చైర్మన్ తేజస్వి శర్మతో కలిసి ఆయన మాట్లాడారు.

శంకరాచార్యులు ఏ పీఠాలు స్థాపించలేదని, పంచాయతన పూజ చేయలేదని, ఆయన శుద్ధ వైష్ణవులని చిన జీయర్ స్వామి తప్పుగా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము జగద్గురు శంకరాచార్యుల శిష్యులమని, ఆయన గురించి శాస్త్రోక్తంగా అన్ని విధాల సమాచారం ఉన్నవారమని, ఆరోపణలు తప్పని శాస్త్రప్రమాణాలతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో మేడూరి సూర్యనారాయణ శర్మ పాల్గొన్నారు.