చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితం నమోదైంది. తిరుప్పత్తూరు నియోజకవర్గంలో అధికార డీఎంకేకు గట్టి షాక్ తగిలింది. టీవీకే పార్టీ అభ్యర్థి ఆర్. సేతుపతి, రాష్ట్ర మంత్రి, డీఎంకే సీనియర్ నాయకుడు కేఆర్ పెరియకరుప్పన్ పై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం సేతుపతి 83,375 ఓట్లు సాధించగా, పెరియకరుప్పన్కు 83,374 ఓట్లు వచ్చాయి. పెరియకరుప్పన్ రీకౌంటింగ్ కోరినా తుది ఫలితం టీవీకే అభ్యర్థినే వరించింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59, అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ 5, పీఎంకే 4 స్థానాలు సాధించాయి.
