చంపాపేట్లో హిట్ అండ్ రన్ కేసు.. యువకుడిని ఢీకొట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

చంపాపేట్లో హిట్ అండ్ రన్ కేసు.. యువకుడిని ఢీకొట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

హైదరాబాద్: చంపాపేట్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. యువకుడిని ఢీ కొట్టిన కారు 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. వివరాల ప్రకారం.. శుక్రవారం (జనవరి 16) రాత్రి చంపాపేట్‎లో సునీల్ కుమార్ (30) అనే యువకుడిని అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టి వంద మీటర్లు ఈడ్చుకెళ్లింది. యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సునీల్‎ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కారు ఎవరిది.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేశారా..? అనే కోణం పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారాంగా వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. 

ఈ మధ్య ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. రోడ్డుపై విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‎ను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ కారు ఆపకుండానే పరార్ అయ్యాడు. ఈ క్రమంలో నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై,జనావాసాల్లో నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు పోలీసులు.