హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీకి అనుకుని ఉన్న 8 ఎకరాల 24 గుంటల భూమి విక్రయానికి హెచ్ఎండీఏ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎకరానికి రూ.99 కోట్ల ప్రారంభ ధర గా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.
ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు ముందస్తుగా ఎకరానికి రూ.5 కోట్ల చొప్పున ఈఎండీ చెల్లించాలన్నారు. ఈ నెల 19 న ప్రీ బిడ్ మీటింగ్ జరుగుతుందని, ఇతర వివరాలను సమావేశంలో తెలుసుకోవాలన్నారు. జూలై 2న ఈ-–వేలం జరుగుతుందని పేర్కొన్నారు.
