ఇంట్లో దొంగతనం.. రూ.9లక్షల విలువైన గోల్డ్ సీజ్

ఇంట్లో దొంగతనం.. రూ.9లక్షల విలువైన గోల్డ్ సీజ్
  • జైలుకు వెళ్లొచ్చినా దొంగబుధ్ది మారలేదు
  • ఇంట్లో దొంగతనం.. రూ.9లక్షల విలువైన గోల్డ్ సీజ్

హైదరాబాద్: చిన్నప్పట్నుంచే చోరీలకు అలవాటుబడ్డ దొంగ ఎన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మారలేదు. చోరీల కేసులో ఇటీవల జైలు నుంచి విడుదలై మళ్లీ ఓ ఇంట్లో దొంగతనం చేసి దొరికిపోయాడు. మహబూబ్ నగర్ కి చెందిన సంతోష్ నాయక్.. ఇటీవల హైదరాబాద్, నారాయణగూడలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా.. నిందితుడు సంతోష్ నాయక్ ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుండి రూ. 9 లక్షల విలువ చేసే 22.4 తులాల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. స్నేహితుడు విక్రమ్ తో కలిసి.. తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసినట్లు విచారణలో సంతోష్ నాయక్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నతనం నుండే దొంగతనాలకు అలవాటు పడ్డ సంతోష్..ఇప్పటికే ఎన్నోసార్లు జైలుకు వెళ్లొచ్చాడని.. అయినా అతడి దొంగ బుద్ధి మారలేదని తెలిపారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర.

మరిన్ని వార్తల కోసం

లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్