పండుగలకు ధరల దెబ్బ

పండుగలకు ధరల దెబ్బ

సిటీలో పెరిగిన టమాట, ఉల్లి, అల్లం రేట్లు 
వర్షాలతో మునిగిన పంటలు..తగ్గిన దిగుబడి
పండుగల నేపథ్యంలో పెరిగిన డిమాండ్‌

ధరల దెబ్బ సిటీలోని బహిరంగ మార్కెట్‌ లో టమాట, ఉల్లి, అల్లం ధరలు పైపైకిపోతున్నాయి. కిలో టమాట రూ.60, కిలో ఉల్లి రూ.55గా ఉన్నాయి. అల్లం ధర కూడా కిలోకు దాదాపు రూ.200లకు చేరి పోటీ పడుతోంది. నెల రోజులు వరుసగా వర్షాలు పడడం మన రాష్ట్రంతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల్లో పంటలు మునిగి పోవడంతో చాలా వరకు దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో పాటు పండుగల సీజన్‌ కావడంతో భారీగా డిమాం డ్‌ పెరిగి దళారులు, వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారు. మరో రెండు నెలలు ఇలాగే ఉండొచ్చని బోయిన్‌ పల్లి కూరగాయల మార్కెట్‌ అధికారి చెప్పారు.

నిన్న మొన్నటి వరకు ఉల్లి ధరలు భారీగానే ఉన్నాయి. ఉల్లి ధరకు దీటుగా టమాటా ధరలు
పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం వరకు టమాటా ధరలు రూ.10 నుంచి రూ.15 ల వరకు
మాత్రమే ఉండేవి. వర్షా లు విస్తారంగా పడటంతో ఆంధ్రప్రదేశ్‌ లోని మదనేపల్లి, కర్నాటక, తెలం-
గాణలో పంటలు మునిగిపోయాయి. దీంతో టమాటా దిగుబడి లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు టమాటా హోల్‌ సెల్‌ లో కిలో రూ.42 ఉండగా, రైతుబజార్‌ లో రూ.52 కాగా బహిరంగా మార్కెట్‌ లో కిలో రూ.60లకు పైగా పలుకుతుంది.

ఇదే విధంగా ఉల్లి ధర ప్రస్తుతం కిలో రూ.55కు చేరింది. ఉల్లి తెలంగాణకు మహబూబ్‌ నగర్‌ , కర్నూల్‌ , కర్నాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అవుతుంది. టమాటా రోజుకు 14,300 బాక్సులు నగరంలోని బోయిన్‌ పల్లి మార్కెట్‌ లోకి వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి కూరగాయాలు దిగుమతి అవుతాయి. అందులో భాగంగానే టమాటా రెండు రోజులుగా రోజుకు 14,300 బాక్సులు వస్తున్నాయి. ఒక్క బాక్సు 25 కిలోల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు నెలల వరకు ఇదే విధంగా ధరలుండే అవకాశం ఉందని బోయిన్‌ పల్లి కూరగాయల మార్కెట్‌ అధికారి వివరించారు.

నవంబర్‌ లోనే ఉల్లి తగ్గింపు..!

వర్షా లు భారీగా పడటంతో పంటలు పాడైపోవడంతో ఉల్లి ధరలు పెరిగిపోయాయి. ఈ ధరలు కొత్త పంటలు వచ్చే వరకు ఇలాగే ఉంటాయని వ్యవసాయ శాఖాధికారులు వివరిస్తున్నారు. నవంబర్‌ రెండో వారం నుంచి ఉల్లి ధరలు తగ్గనున్నట్లు తెలిపారు. గత నెలలో మొజంజాహీ మార్కెట్‌ లో ఉల్లి17,500 క్వింటాళ్ల దిగుమతి ఉండేది. ఇప్పడు దిగుమతి తగ్గడంతో ధరలు పెరిగిపోయాయి.

వెల్లుల్లి ధర సైతం రోజురోజుకూ పెరుగుతూ ఘాటెక్కుతోంది. వీటికి తోడు అల్లం ధరలూ సామాన్యు డికి అందనంత స్థాయికి చేరుతోంది. వేసవికాలంలో ఉల్లి రూ.10కే కిలో లభించేది. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.55 కి చేరింది. వెల్లుల్లి రూ.150 నుంచి 200 వరకు ఎగబారింది. అదే దారిలో అల్లం వెల్లుల్లి పోటీ పడుతోంది. సాధారణంగా కిలోకు రూ.80 ఉండేది. ఇటీవల కాలంలో రూ.120 నుంచి 150కి చేరుకుం ది. కొన్ని ప్రాంతాల్లో రూ.200 వరకూ విక్రయిస్తున్నారు.