హోం ఐసోలేషన్​కు కొత్త రూల్స్‌ ఇవే..

హోం ఐసోలేషన్​కు కొత్త రూల్స్‌ ఇవే..

న్యూఢిల్లీ: హోం ఐసోలేషన్ గైడ్​లైన్స్​లో కేంద్ర ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఇప్పటికే ఏదో ఒక వ్యాధి బారిన పడి బాధపడుతున్న వ్యక్తికి కరోనా వస్తే.. వారు హోమ్ ఐసోలేషన్​లో ఉండేందుకు పర్మిషన్ ఇవ్వరు. కరోనా లక్షణాలు కనిపించిన 10 రోజుల తర్వాత రోగులకు వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోతే ఐసోలేషన్​లో ఉండాల్సిన అవసరం లేదు. వెరీ మైల్డ్, ప్రీ సింప్టమాటిక్, అసింప్టమాటిక్ కరోనా పేషెంట్ల హోం ఐసోలేషన్ రివైజ్డ్ గైడ్​లైన్స్​ను రిలీజ్ చేసింది.

రివైజ్డ్ గైడ్ లైన్స్ ఇవీ..

  • రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పేషెంట్లు (హెచ్ఐవీ, అవయవ మార్పిడి చేసుకున్న వారు, క్యాన్సర్ థెరపీ చేసుకుంటున్న వారు) హోం ఐసోలేషన్​లో ఉండేందుకు అర్హులు కాదు.
  • 60 ఏళ్లు పైబడిన రోగులు, రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు డాక్టర్ల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్​లో ఉండేందుకు పర్మిషన్ ఇస్తారు.
  • హోం ఐసోలేషన్ టైంను సర్కారు తగ్గించింది. కరోనా లక్షణాలు కనిపించిన 10 రోజుల తర్వాత రోగులకు వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోతే ఐసోలేషన్​లో ఉండాల్సిన అవసరం లేదు. అయితే తర్వాత కూడా ఐసోలేట్ అయి ఉండాలని అడ్వైజ్ చేస్తారు. ఏడు రోజుల వరకు పేషెంట్ తన ఆరోగ్య పరిస్థితిని సెల్ఫ్ మానిటర్ చేసుకోవాలి.
  • హోం ఐసోలేషన్ పిరియడ్ అయిపోయిన తర్వాత టెస్టులు చేయాల్సిన అవసరం లేదు.
  • వెరీ మైల్డ్, ప్రీ సింప్టమాటిక్ పేషెంట్లు హోం ఐసోలేషన్​లో ఉండాలంటే ఉండొచ్చు. అయితే అక్కడ సెల్ఫ్ ఐసోలేషన్ ఫెసిలిటీ కచ్చితంగా ఉండాలి.24×7 ప్రాతిపదికన పేషెంట్​ను చూసుకునేందుకు ఓ సంరక్షకుడు అందుబాటులో ఉండాలి. హోం ఐసోలేషన్ పిరియడ్ అయిపోయే వరకు కేర్ గివర్, ఆస్పత్రి మధ్య కమ్యూనికేషన్ లింక్ అవసరం.
  • కేర్ గివర్, పేషెంట్ క్లోజ్ కాంటాక్ట్స్.. డాక్టర్ల సూచన మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వేసుకోవాలి.
  • ఆరోగ్య సేతు యాప్ డౌన్​లోడ్ చేసుకోవాలి. అన్ని సమయాల్లో అది ఆన్​లోనే ఉండాలి.
  • పేషెంట్లు రెగ్యులర్​గా తమ హెల్త్​ను మానిటర్ చేసుకోవాలి. జిల్లా సర్వైలెన్స్ ఆఫీసర్​కు తమ హెల్త్ స్టేటస్​ను రెగ్యులర్​గా ఇన్ఫామ్ చేయాలి.
    ఐసోలేషన్​లో ఉన్న పేషెంట్​లో సీరియస్ సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే మెడికల్ అటెన్షన్ ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి కేసులను రాష్ట్రాలు పర్యవేక్షించాలి.
  • హోం ఐసోలేషన్​లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని ఫీల్డ్ స్టాఫ్/నిఘా బృందాలు వ్యక్తిగతంగా వెళ్లి తెలుసుకోవాలి. ప్రత్యేక కాల్ సెంటర్‌ ద్వారా రోగుల మెడికల్ కండిషన్​పై ఫాలో అప్ చేయాలి.
  • ప్రతి పేషెంట్ క్లినికల్ స్టేటస్​ను ఫీల్డ్ స్టాఫ్ లేదా, కాల్ సెంటర్ ద్వారా రికార్డు చేయాలి. (బాడీ టెంపరేచర్, పల్స్ రేట్, ఆక్సిజన్ సాచురేషన్ వంటివి నమోదు చేసుకోవాలి.
  • ఐసోలేషన్​లో ఉన్న పేషెంట్ల వివరాలను కొవిడ్ 19 పోర్టల్​లో అప్​డేట్ చేయలి.

తెలంగాణ కరోనా టెస్టుల్లో లాస్ట్..పాజిటివ్ రేటులో ఫస్ట్