స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొననున్న 3 టెల్కోలు

స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొననున్న  3 టెల్కోలు

న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌‌‌‌టెల్,  వొడాఫోన్ ఐడియాలు రూ. 96,317 కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తమ దరఖాస్తులను సమర్పించాయి. వేలం జూన్ 6 నుంచి ప్రారంభమవుతుంది. 2022లో జరిగిన చివరి వేలంలో అదానీ గ్రూప్ సంస్థ స్పెక్ట్రమ్​కోసం బిడ్​వేసింది. ఈసారి మాత్రం అది పాల్గొనడం లేదు. మొబైల్ ఫోన్ సేవల కోసం ప్రభుత్వం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్‌‌‌‌లను సుమారు రూ.96,317 కోట్ల బేస్ ధరతో వేలం వేయనుంది. 

800 మెగాహెర్జ్​, 900 మెగాహెర్జ్​, 1,800 మెగాహెర్జ్​, 2,100 మెగాహెర్జ్​, 2,300 మెగాహెర్జ్​, 2,500 మెగాహెర్జ్​, 3,300 మెగాహెర్జ్,​  26 గిగాహెర్జ్​ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌‌‌‌లను అమ్మనుంది.  ఈ స్పెక్ట్రమ్​ను 20 సంవత్సరాలు వాడుకోవచ్చు. డబ్బును 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లించాలి.