పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన హోం మంత్రి మహమూద్‌ అలీ

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన హోం మంత్రి మహమూద్‌ అలీ

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చర్యలు చేపడుతోందన్నారు హోం మంత్రి మహమూద్‌ అలీ. పంజాగుట్టలో కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. రూ.6కోట్ల GHMC నిధులతో మొట్టమొదటి సారిగా పంజాగుట్ట శ్మశాన వాటిక దగ్గర ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింన్నారు. ఈ బ్రిడ్జితో పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు..ట్రాఫిక్ సమస్య ఉండదని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు లాక్‌డౌన్‌ సమయంలోనూ కొనసాగించినట్లు హోం మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కమిషనర్‌ GHMC లోకేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.