V6 News

ఉత్తమ పోలీసులకు అవార్డులు

 ఉత్తమ పోలీసులకు అవార్డులు

హైదరాబాద్‌‌, వెలుగు: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 718 మంది పోలీస్‌‌, ఫైర్ సిబ్బందికి రాష్ట్ర హోంశాఖ శుక్రవారం అవార్డులు ప్రకటించింది. తెలంగాణ స్టేట్‌‌ శౌర్య పథకం, మహోన్నత సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, కఠిన సేవా పథకం,సేవా పథకం అవార్డు గ్రహీతల పేర్లతో కూడిన  జీవోను ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్‌‌‌‌ విడుదల చేశారు. 

పోలీస్‌‌, ఎస్‌‌పీఎఫ్‌‌, ఫైర్ సర్వీసెస్‌‌, యాంటీ కరప్షన్‌‌ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్‌‌ఫోర్స్​మెంట్‌‌కు చెందిన సిబ్బంది వివరాలను వెల్లడించింది.  ఇంటెలిజెన్స్‌‌, ఎస్‌‌ఐబీ, ఎస్‌‌ఐడబ్ల్యూకు చెందిన ఎస్‌‌ఐ కరీంతో పాటు మరో 9మందికి, అసెంబ్లీ ఫైర్​స్టేషన్‌‌ అసిస్టెంట్‌‌ డిస్ట్రిక్ట్‌‌ ఫైర్‌‌‌‌ ఆఫీసర్‌‌ ధనుంజయ రెడ్డి,సికింద్రాబాద్‌‌ ఫైర్ ఆఫీసర్ మోహన్‌‌రావుకు శౌర్య పథకం అవార్డుతో పాటు  మొత్తం ఐదు కేటగిరీల అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది.