రూ. వెయ్యి ఫోన్‌ పోయిందని.. విద్యార్థినులను చితకబాదింది

రూ. వెయ్యి ఫోన్‌ పోయిందని.. విద్యార్థినులను చితకబాదింది

హాస్టల్‌ స్టూ డెంట్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ ఎస్ వో కిరాతకంగా ప్రవర్తించింది. సెల్ ఫోన్‌ దొంగిలించారంటూ 40 మంది విద్యార్థినులను ఇష్టమొచ్చినట్టు చితకబాదింది. మండుటెండలో మోకాళ్లపై మూడు గంటలపాటు నిలబెట్టింది. ఇష్టారీతిగా కొట్టడంతో చేతులకు, ఎండలో నిలబడటంతో కాళ్లకు బొగ్గలొచ్చి స్టూడెంట్లు నరకం చూశారు. వికారాబాద్‌ జిల్లా మొమిన్ పేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో జరిగిందీ ఘటన.తీయలేదన్నా వినకుండా.. మొమిన్ పేట  కస్తూర్బా స్కూల్లో 215 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. స్కూల్లో ఎస్ వో సత్తు శైలజతో పాటు ఏడుగురు టీచర్లు, నలుగురు వంటమనుషులు, నైట్ చ్ న్‌ నర్సమ్మ విధులు నిర్వహిస్తున్నారు. తన సెల్ ఫోన్‌ (రూ. వెయ్యి) పోయిందంటూ నర్సమ్మ ఎస్ వో కు చెప్పింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు స్టూడెంట్లు ఉన్న గదిలోకి వెళ్లిన ఎస్ వో గట్టిగా అరుస్తూ వాళ్లను నిద్ర లేపింది.వాచ్ మెన్‌ ఫోన్‌ పోయింది, ఎవరు తీశారో చెప్పాలని గట్టిగా అడిగింది. తామెవరమూ తీయలేదని స్టూ డెంట్లు చెప్పా రు. కానీ మీలోనే ఎవరో తీశారంటూ వాళ్లను గదిలోనే పెట్టి లాక్‌ చేసింది. ఉదయం 11గంటలకు తలుపు తీసి అందరినీ ఇష్టమొచ్చినట్టు చితకబాదింది. స్కూలు ఆవరణలో ఎర్రటి ఎండలోమోకాళ్లపై నిలబెట్టింది. మధ్యాహ్నం 2 గంటల వరకు కాలుతున్న బండలపై నిలబడటంతో విద్యార్థినుల కాళ్లకు బొగ్గలొచ్చాయి . ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో చేతులు కందిపోయాయి.

టీసీలిస్తే పోతాం

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం స్కూలుకు వచ్చారు. పిల్లల కాళ్లు, చేతులు కందిపోవడం చూసి చలించి పోయారు. సిబ్బం దిపై మండిపడ్డా రు. దీంతో వెంటనే వాళ్లు స్థానిక ఆస్పత్రికి తరలించిచికిత్స చేయించారు. ఎంపీడీవో శైలజారెడ్డికి విషయం తెలియడంతో స్కూలుకు చేరుకొని విద్యార్థినులను వివరాలు అడిగారు. ఎస్ శైలజ తమకొద్దని, టీసీలిస్తే ఇంటికెళ్లిపోతామని స్టూడెంట్లు మొరపెట్టుకున్నారు. హాస్టల్‌కు మగవాళ్లు రావొద్దని నిబంధన ఉన్నా ఎస్ వో పాటించడం లేదని చెప్పారు. తమ ప్రాణాలంటే ఆమెకు లెక్కలేదన్నారు. దీంతో విషయాన్ని కలెక్టర్‌,డీఈవోకు వివరిస్తానని, ఎస్ వో ను, నైట్‌ వాచ్ మన్‌ను తొలగిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. డీఈవోరేణుక కూడా విషయంపై ఆరా తీశారు. మోమిన్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

నడవలేకపోతున్నా..

ఎస్ కొట్టిన దెబ్బలు, ఎండలోనిలబెట్టడంతో చేతులు, కాళ్లకుబొగ్గలొచ్చాయి. నడవలేకపోతున్నాం. భోజనంచేద్దా మంటే చేతులు సహకరించడం లేదు.ఎండలో నిలబడ్డప్పుడు నరకం చూశాం.ఎస్ ను వెంటనే తొలగించాలి. – నవజ్యోతి, 9వ తరగతి విద్యార్ధిని