వాటే క్రేజీ సెటప్..అచ్చు సీబీఐ ఆఫీసే.. సేమ్ టు సేమ్ ముంబై పోలీసు ప్రధాన కార్యాలయమే..జాతీయ జెండా, ప్రముఖుల ఫొటోలు, అధికారిక లోగోలు..చూస్తే నిజమైన దర్యాప్తు సంస్థ కార్యాలయం అనిపించేలా ఏర్పాట్లు.. భారతీయులను మోసం చేసేందుకు వేసిన సెటప్.. దర్యాప్తు సంస్థలు, పోలీసు కార్యాలయాలను చూపి దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఏర్పాటు చేసిన స్కామ్ సెంటర్. కాంబోడియా స్కామ్ సెంటర్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి.
కంబోడియాలోని ఒక పాడుబడిన స్కామ్ సెంటర్ కు సంబంధించిన రాయిటర్స్ బయటపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కామర్లు డిజిటల్ అరెస్టులు పేరుతో విదేశాలనుంచి ఎలా మోసాలకు పాల్పడుతున్నారు.. భారతీయులను మోసం చేసేందుకు ఎలా సెటప్ చేశారో ఈ వీడియోలో కనిపిస్తుంది.
జర్నలిస్ట్ మున్సిఫ్ వెంగట్టిల్ X లో షేర్ చేసిన ఈ వీడియో..కంబోడియాలోని ఓ పాడుబడిన స్కామ్ సెంటర్ దృశ్యాలను చూపిస్తుంది. వీడియో కాల్స్ తో బాధితులు బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకునేందుకు నిజంగా సీబీఐ అధికారులే కాల్ చేశారు అని నమ్మేలా క్రియేట్ చేశారని ఆరోపించారు. ఈ సెటప్‌లో CBI లోగో, భారత జాతీయ జెండాలు,మహాత్మా గాంధీ ,డాక్టర్ BR అంబేద్కర్ ఫొటోలతో బ్యానర్లు ఉన్నాయి. అదే స్కాం సెంటర్ లో మరొక గది ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం లాగా కనిపించేలా సెటప్ చేసినట్లు కనిపిస్తోంది.
ఇంతకాలం డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎక్కడినుంచి కాల్స్ వస్తున్నాయి. ఇండియన్స్ ను ఎలా మోసం చేస్తున్నారు.కోట్లలో డబ్బును ఎలా దోపిడీ చేస్తున్నా రు అనే అంశాలపై సమాధానం దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలో రాయిటర్స్ విడుదల చేసిన వీడియోలు భయంకరమైన నిజాలను బయటపెట్టాయి.
ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో తీవ్ర ఆందోళన, పెద్ద ఎత్తున్ చర్చకు దారి తీసింది. అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్ వర్క్ ఎంత బాగా డెవలప్ అయిందో హైలైట్ చేసింది. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా ఈ క్లిప్‌పై స్పందించారు. దానిని Xలో ఓ పోస్ట్ షేర్ చేశారు .హై క్రేజ్ ఈ దిస్ అంటూ కామెంట్ చేశారు. స్కామర్లు ఏర్పాటు చేసిన సెటప్, మోసం చేస్తున్ తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
డిజిటల్ అరెస్ట్ లపై అధికారులు పదే పదే ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. స్కామర్లు సీబీఐ అధికారులం, ఈడీ లేదా పోలీసు ఉన్నతాధికారులం అంటూ బెదరించి సైబర్ నేరాలకు పాల్పడే ఛాన్స్ ఉంది. డ్రగ్స్,మనీలాండరింగ్ పేరుతో బెదిరించి డబ్బును కాజేస్తారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
This is not a CBI facility. Nor the office of Mumbai Police.
— Munsif Vengattil (@MunsifV) February 11, 2026
Reuters visuals from an abandoned scam center in Cambodia shows how scamsters used fake signs, Indian flag, and even pictures of Gandhi and Ambedkar to defraud Indians from abroad in "digital arrests". pic.twitter.com/xFXZpwgvE9
