ఫ్రిజ్‌ని సరైన పద్ధతిలో వాడకపోతే కొన్ని రోజులకే అటకెక్కుతుంది. అలా కాకూడదంటే దాని మెయింటెనెన్స్, క్లీనింగ్‌పై శ్రద్ధ పెట్టాలి. కొన్నిసార్లు ఫ్రిజ్‌లో పెట్టిన కూరగాయలు, ఆకుకూరలు కుళ్లిపోయి ఫ్రిజ్ అంతా వాసన వస్తుంది. అది పోవాలంటే ఫ్రిజ్‌లో అక్కడక్కడ నిమ్మ చెక్కలు పెట్టాలి. ఫ్రిజ్ వాసన రాకూడదంటే చిన్న కప్పులో వంట సోడా తీసుకుని ఫ్రిజ్‌లో ఓ మూల పెట్టాలి. ఒక గిన్నెలో పావువంతు నీళ్లు తీసుకుని రెండు టీస్పూన్ల వంటసోడా కలపాలి. ఆ నీళ్లలో స్పాంజి ముంచి ఫ్రిజ్ తుడిస్తే మెరుస్తుంది.
- స్ప్రే బాటిల్లో ఒక కప్పు నీళ్లు, ఒక టీ స్పూన్ వెనిగర్ వేయాలి. ఆ లిక్విడ్‌ని బాగా కలిపి ఫ్రిజ్‌లో స్ప్రే చేస్తే శుభ్రమవుతుంది.
- సింగిల్ డోర్ ఫ్రిజ్‌లలో ఐస్ గడ్డకడుతుంటుంది. అలాంటప్పుడు కత్తితో డీప్ ఫ్రీజ్‌లో ఐస్ తీయకూడదు. అలా చేస్తే ఫ్రీజర్‌లో ఉండే పైపు పగిలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల గ్యాస్ లీక్ అవుతుంది.
- ఫ్రిజ్ ఆన్‌లో ఉన్నప్పుడు అటూ ఇటూ కదపకూడదు. అలాగే రెండుమూడు గంటలకు మించి కరెంట్ పోతే ఫ్రిజ్ తెరిచి పెట్టాలి. లేదంటే లోపలి ఫుడ్ పాడయ్యే అవకాశం ఉంటుంది.
