రిజర్వేషన్లు తెలియకుండా నామినేషన్లు ఎలా వేస్తారు

రిజర్వేషన్లు తెలియకుండా నామినేషన్లు ఎలా వేస్తారు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఫైరయ్యారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓటర్ల జాబితా ఫైనల్ కాకుండా షెడ్యూల్ ఇవ్వడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికలకు తాము భయపడడం లేదని, రిజర్వేషన్లు తెలియకుండా నామినేషన్లు ఎలా వేస్తారన్నారు. రిజర్వేషన్ల ప్రకటన తర్వాత నామినేషన్ల దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలంటున్నామే తప్ప, ఎన్నికలు వాయిదా వేయాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు ఉత్తమ్. కోర్ కమిటీ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు ఉత్తమ్.