నేడు (సెప్టెంబర్27)  కొండా లక్ష్మణ్ బాపూజీ111వ జయంతి

నేడు (సెప్టెంబర్27)  కొండా లక్ష్మణ్ బాపూజీ111వ జయంతి

తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు నిబద్ధతతో పోరాడిన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు.

బాపూజీ.. తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లు, ఆస్తులను సైతం అంకితం చేశారని పేర్కొన్నారు. ప్రజా హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ఆయన సేవలు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని పేర్కొన్నారు.