బంగారు కూత..ఆసియా క్రీడల్లో ఇండియా కబడ్డీ జట్ల స్వర్ణాల మోత

బంగారు కూత..ఆసియా క్రీడల్లో ఇండియా కబడ్డీ జట్ల స్వర్ణాల మోత

 

  • మెన్స్‌‌ టీమ్‌‌కు 9వ గోల్డ్‌‌, విమెన్స్‌‌కు నాలుగోది
  • అథ్లెటిక్స్‌‌లో రెండు రజతాలు, ఒక కాంస్యం
  • షూటింగ్‌‌లో సిల్వర్‌‌ మెడల్‌‌

ఆసియా క్రీడల కబడ్డీ పోటీల్లో ఇండియా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్లుగా బరిలోకి దిగిన మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ జట్లు ‘బంగారు కూత’ పెట్టాయి. శనివారం జరిగిన మెన్స్‌‌‌‌ ఫైనల్లో ఇండియా 40-34తో ఇరాన్‌‌‌‌పై గెలవగా, విమెన్స్‌‌‌‌ జట్టు కూడా 37-34తో ఇరాన్‌‌‌‌ను చిత్తు చేసింది. మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఇది తొమ్మిదో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ కాగా, విమెన్స్‌‌‌‌కు నాలుగోది. ఇక అథ్లెటిక్స్‌‌‌‌లో రెండు రజతాలు, ఓ కాంస్యం, షూటింగ్‌‌‌‌లో మరో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌తో ఇండియా పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతోంది.

నగోయా: ఆసియా క్రీడల కబడ్డీ పోటీల్లో ఇండియా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. డిఫెండింగ్‌‌ చాంపియన్లుగా బరిలోకి దిగిన మెన్స్‌‌, విమెన్స్‌‌ జట్లు ‘బంగారు కూత’ పెట్టాయి. శనివారం జరిగిన మెన్స్‌‌ ఫైనల్లో ఇండియా 40–34తో ఇరాన్‌‌పై గెలవగా, విమెన్స్‌‌ జట్టు కూడా 37–34తో ఇరాన్‌‌ను చిత్తు చేసింది. మెన్స్‌‌ టీమ్‌‌కు ఇది తొమ్మిదో గోల్డ్‌‌ మెడల్‌‌ కాగా, విమెన్స్‌‌కు నాలుగోది. మ్యాచ్‌‌ ఆరంభం నుంచి ఇండియా ప్లేయర్లు అద్భుతంగా ఆడటంతో జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ప్లేయర్‌‌ పవన్‌‌ సెహ్రావత్‌‌ కనీసం మ్యాట్‌‌పైకి అడుగుపెట్టాల్సిన అవసరం కూడా రాలేదు.

ఇరాన్‌‌ కూడా ఇండియా ప్లేయర్ల శారీర బలానికి దీటుగా నిలవడమే కాకుండా కొన్నిసార్లు పాయింట్ల పరంగా ఆధిక్యం సాధించింది. దాంతో 18–17తో ఫస్ట్‌‌ హాఫ్‌‌ను ముగించింది. ఇరాన్‌‌ దూకుడు ముందు కాస్త నిరాశపడిన ఇండియన్‌‌ ప్లేయర్లు తర్వాత వ్యూహం మార్చి సక్సెస్‌‌ అయ్యారు. నిర్ణయాత్మక దశలో రైడర్లు అర్జున్‌‌ దేశ్వాల్‌‌,  దేవాంక్‌‌ అత్యంత సంయమనంతో ఇరాన్‌‌ కోర్టులోకి చొచ్చుకుపోయి కీలక పాయింట్లు సాధించారు.

అస్లామ్‌‌ ముస్తఫాను డిఫెన్స్‌‌లోకి తీసుకోవడం ఇండియాకు మరింత లాభం చేకూర్చింది. రక్షణ శ్రేణి పటిష్టం కావడంతో ఇరాన్‌‌కు పాయింట్లు సాధించడం కష్టమైంది. దాంతో ప్రత్యర్థిని ఆలౌట్‌‌ చేసిన ఇండియా 29–24తో నిలిచింది. సెకండాఫ్‌‌లో ఆట వేగం తగ్గించి రైడర్లు మిడ్‌‌ లైన్‌‌ చుట్టూ తిరుగుతూ అవకాశాలను సృష్టించారు. దాంతో ఇరాన్‌‌ను బలవంతంగా రిస్క్‌‌ తీసుకునేలా చేసి వరుసగా పాయింట్లు నెగ్గి ‘స్వర్ణ’ కళను నెరవేర్చుకున్నారు. 

అమ్మాయిలూ అదరహో..

విమెన్స్‌‌ ఫైనల్లోనూ ఇండియా అమ్మాయిలు ఏమాత్రం తడబడలేదు. గ్రూప్‌‌ దశలో ఇరాన్‌‌ను ఓడించిన ఆత్మవిశ్వాసాన్ని ఇక్కడా చూపెట్టారు. పోటీ తీవ్రత పెరిగినప్పుడల్లా రైడర్లు నికితా, కెప్టెన్‌‌ పూజ, సంజూ దేవి పదేపదే ఇరాన్‌‌ బలహీనతలపై దెబ్బకొట్టారు. ఆటను వేగంగా ప్రారంభించిన ఇండియా 3–1 ఆధిక్యంలోకి వెళ్లి ఇరాన్‌‌ను ముగ్గురు క్రీడాకారిణిలకే పరిమితం చేసింది. తర్వాత ఇరాన్‌‌ పుంజుకోవడంతో స్కోరు 7–7తో సమమైంది.

తొలి హాఫ్‌‌లో ఇండియా రైడింగ్‌‌ పటిష్టంగా లేకపోయినా రక్షణ శ్రేణి ఆ లోటును భర్తీ చేసింది. దాంతో ఏకైక ఆలౌట్‌‌ను సాధించి 22–16 ఆధిక్యంతో నిలిచింది. రెండో హాఫ్‌‌లో పుంజుకున్న ఇరానీయన్లు 27–28తో దగ్గరగా వచ్చారు. అప్పటివరకు ఇండియా నియంత్రణలో ఉన్న మ్యాచ్‌‌ ముగింపులో ఉత్కంఠ మొదలైంది. అయితే ఇండియన్లు అనుభవంతో రక్షణశ్రేణిని పటిష్టం చేసుకుని ఎదురుదాడులకు దిగారు. ఆట తీరులో సాంప్రదాయబద్దంగా వ్యవహరించడంతో ఇరాన్‌‌ పెద్ద రిస్క్‌‌లు చేయాల్సి వచ్చింది. ఒక్క నిమిషం మిగిలి ఉండగా ఇండియా తన ఆధిక్యాన్ని క్రమంగా 37–31కి పెంచుకుని స్వర్ణం వైపు అడుగులు వేసింది.