బాలకృష్ణ గారితో నటించడం బ్లెస్సింగ్స్ అంటున్న హర్షాలీ మల్హోత్రా

బాలకృష్ణ గారితో నటించడం బ్లెస్సింగ్స్ అంటున్న హర్షాలీ మల్హోత్రా

‘బజరంగీ భాయిజాన్’ చిత్రంతో  చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌గా మెప్పించిన హర్షాలీ మల్హోత్రా.. ఇప్పుడు ‘అఖండ 2 తాండవం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.  బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 5న  వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె పోషించిన పాత్ర గురించి 

హర్షాలీ మల్హోత్రా చెప్పిన విశేషాలు.

‘దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్‌‌‌‌‌‌‌‌కి వస్తున్నా. బజరంగీ భాయిజాన్ తర్వాత స్టడీస్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ చేశా. అలాగే కథక్  నేర్చుకున్నా. తర్వాత మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న  సమయంలోనే  ‘అఖండ2’  అవకాశం వచ్చింది.  ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. జనని పాత్రలో కనిపిస్తా.  తను చాలా స్వీట్, కేరింగ్. తనకి అఖండ బ్లెస్సింగ్స్ ఉంటాయి. జనని లైఫ్ ఎప్పుడు డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అఖండ తనకోసం వస్తారు.  మైనస్ డిగ్రీస్ ఉన్న కొన్ని లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో షూట్ చేశాం. అంత చలి ప్రదేశాలలో షూటింగ్ వెరీ చాలెంజింగ్. 

అలాగే ఈ సినిమాలో యాక్షన్ స్టంట్స్ కూడా చేశాను. బాలకృష్ణ గారు,  సంయుక్త మీనన్‌‌‌‌‌‌‌‌తోనే  నాకు కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ సీన్స్ ఉన్నాయి. లెజెండరీ బాలకృష్ణ గారితో నటించడం బ్లెస్సింగ్స్‌‌‌‌‌‌‌‌గా భావిస్తా. ఆయన  వెరీ కూల్. చాలా కేరింగ్ పర్సన్. నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఒక ఫ్యామిలీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా చూసుకున్నా రు. 

ఆయన ఎనర్జీ అన్ స్టాపబుల్. ఆయనతోపాటు  బోయపాటి గారి డైరెక్షన్ అమేజింగ్. జనని పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక మంచి కాంబినేషన్స్‌‌‌‌‌‌‌‌లో మెయిన్ లీడ్‌‌‌‌‌‌‌‌గా చేయాలని ఉంది. అలాగే ఛాలెంజింగ్  క్యారెక్టర్స్ చేయాలని ఉంది’.