వాటర్ మెలన్ల కోసం జనం ఎగబడుతున్రు

వాటర్ మెలన్ల కోసం జనం ఎగబడుతున్రు

హైదరాబాద్: వేసవి ప్రారంభమవడంతో  పుచ్చకాయల  సీజన్ వచ్చేసింది.  ప్రస్తుతం  ఎండలు పెరగడంతో వాటర్ మెలన్ కు  భారీ డిమాండ్  పెరిగింది..  టేస్ట్ తో  పాటు ఎండల నుంచి  ఉపశమనం పొందడానికి పుచ్చకాయల కోసం జనం ఎగబడుతున్నారు. పుచ్చకాయలు శరీరంలో వేడిని తగ్గించి ఎండల నుంచి రిలీఫ్ ఇస్తాయి. ఇవి తింటే బీపీ, షుగర్ కంట్రోల్ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో చర్మ క్యాన్సర్లు, అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.  ఏ, సి, విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్లు కూడా పుచ్చకాలం నుంచి దొరుకుతాయని వారు అంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్లో రెండు రకాల పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో  నల్లవి రుచిగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. లాక్ డౌన్  తర్వాత మార్కెట్లో ఇవి తక్కువ ధరలకు దొరుకుతున్నట్టు చెప్పారు. కేజీ వాటర్ మిలన్ 25 రూపాయల దాకా వ్యాపారులు సేల్స్ చేస్తున్నారు. కొత్తపేట మార్కెట్... బాట సింగారంనకు షిప్ట్ అవడంతో పండ్ల వ్యాపారులకు ఇబ్బందిగా ఉంది. రవాణా ఛార్జీలు పెరిగాయి. సమ్మర్ సీజన్ కావడంతో పుచ్చకాయల కు ఫుల్ డిమాండ్ ఉందంటున్నారు.  రోజుకు దాదాపు 200 కేజీలు అమ్ముతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో పుచ్చకాయలు తినడం వల్ల నీరు శాతం ఎక్కువగా శరీరానికి చేరుతోంది.  అందువల్ల వడదెబ్బలాంటి పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శరత్ కన్నుమూత

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు