శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అర్థరాత్రి  భారీ పేలుడు జరిగింది. మొదట యూనిట్ -1 నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ రావడంతో సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. పవర్ హౌస్ లో  విధులు నిర్వహిస్తున్న 9 మంది సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం . ప్రమాదంలో చిక్కుకున్న వారిలో DE శ్రీనివాస్ , నలుగురు AE లు సుందర్,మోహన్ కుమార్,ఉజ్మ ఫాతిమా, వెంకట్ రావ్, సిబ్బంది రాంబాబు,కిరణ్ , మహేష్, వినేష్ తోపాటు ఇద్దరు హైదరాబాద్ నుంచి వెళ్లిన అమర్ రాజా కంపెనీ సిబ్బంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది సొరంగంలో చిక్కుకున్న కొంతమందిని రక్షించారు. మిగతా వారిని బయటకు తీసుకువచ్చేందుకు  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మంటలు, పొగ కారణంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఫైర్ సిబ్బంది అవస్థకు గురయ్యారు. మూడు సార్లు సొరంగంలోకి వెళ్లి ఆక్సిజన్ అందక వెనక్కి వచ్చారు. మంటలను అదుపు చేయటం కోసం విద్యుత్ ప్లాంట్ పూర్తిగా నిలిపివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు, నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు.,