చక్కెర ఎగుమతులకు భారీ అవకాశాలు

చక్కెర ఎగుమతులకు భారీ అవకాశాలు

న్యూఢిల్లీ: బ్రెజిల్​ వంటి దేశాల్లో చక్కెర ఉత్పత్తి తగ్గడంతో భారతీయ ఎగుమతిదారులు పోయిన ఏడాది భారీ ఎత్తున చక్కెరను ఎగుమతి చేశారు. ఈ ఏడాది కూడా అవే తరహా పరిస్థితులు ఉన్నాయి. చక్కెర ఎగుమతులకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021-–22 చక్కెర సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో (అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు) మనదేశం రికార్డు స్థాయిలో 11.3 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. దీనివల్ల దేశానికి దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. 2023 షుగర్​ సీజన్​లో.. అంటే మే 2023 నాటికి మన మిల్లులు 6 మిలియన్ టన్నులు (ఎంటీ) ఎగుమతి చేయవచ్చని ప్రకటించింది.   ఈసారి 9 మిలియన్ టన్నుల ఎగుమతులకు  అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్​పర్టులు చెప్పారు.  2020–-21 చక్కెర సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  భారతదేశం 7.2 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. ఇది 2019–-20లో 5.9 మిలియన్ టన్నుల నుంచి 22శాతం పెరిగింది. 2018–-19 సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎగుమతులు 3.8 మిలియన్ టన్నులు కాగా, 2019-–20 నాటికి  55శాతం పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అందజేసిన సమాచారం ప్రకారం..  2013–-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2021–-22 ఆర్థిక సంవత్సరం వరకు ఎగుమతులు 291శాతం పెరిగాయి.  ఇండియా రేటింగ్స్ & రీసెర్చ్ (ఇండ్-రా) అసోసియేట్ డైరెక్టర్  ఖుష్బూ లఖోటియా మాట్లాడుతూ, భారతదేశం పోయిన కొన్ని సంవత్సరాలుగా చక్కెర ఎగుమతుల్లో నంబర్​వన్​గా నిలిచిందని, 55–-65 మెట్రిక్​ టన్నుల ప్రపంచ వాణిజ్యంలో 10శాతానికిపైగా వాటా ఉందని వివరించారు.  అనేక అంశాలను బేరీజు వేసుకున్నాకే..తొమ్మిది మిలియన్ టన్నుల ఎగుమతుల అంచనాకు వచ్చినట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) అధికారులు తెలిపారు.  ఈ సంవత్సరం ప్రారంభ నిల్వ 5.5 ఎంటీలు కాగా,   ప్రస్తుత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో (సెప్టెంబర్ 30, 2023 వరకు) 36.5 మెట్రిక్​ టన్నుల చక్కెర ఉత్పత్తిని అంచనా వేస్తోంది.  ఇందులో తొమ్మిది మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించాలని  ప్రభుత్వాన్ని కోరామని ఇస్మా తెలిపింది. దీనివల్ల దేశానికి భారీగా విదేశీ మారకం వస్తుందని,  ప్రపంచ చక్కెర మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన వాటా మరింత పెరుగుతుందని ఎక్స్​పర్టులు అంటున్నారు. 

మన చక్కెరకు మంచి డిమాండ్​

భారతదేశం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారే కాదు,  రెండవ అతిపెద్ద ఎగుమతిదారు కూడా.  థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ నుంచి ఎగుమతులు తక్కువగా ఉండటం,  బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వాతావరణ సమస్యలు, అంతర్జాతీయ ధరలు విపరీతంగా పెరగడంతో ఇండియాకు చాలా అవకాశాలు వస్తున్నాయి.  అనేక ఆసియా, ఆఫ్రికన్, మిడిల్​ ఈస్ట్​ దేశాలలో భారతీయ చక్కెరకు చాలా డిమాండ్​ ఉంది.  ఇండియా బ్రెజిల్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నది.  ప్రపంచ వాణిజ్యంలో  ఈ దేశానికి 35-–45శాతం వాటా ఉంది.  
వాతావరణ ఇబ్బందులు, చెరకును ఇథనాల్ తయారీకి వాడటం వల్ల బ్రెజిలియన్ చక్కెర సరఫరా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉత్పత్తి కూడా తగ్గుతున్నందున ఈ పరిస్థితి భారతీయ ఎగుమతిదారులకు అనుకూలంగా మారుతుందని స్టడీ రిపోర్టులు అంటున్నాయి.  ప్రపంచ చక్కెర మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారతదేశ వాటా దాదాపు 15శాతం వరకు పెరగవచ్చని ఇండ్​రా పేర్కొంది.  గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి బ్రెజిలియన్ సరఫరాలు వచ్చే సమయానికి ఇండియా 6 మిలియన్ టన్నులను ఎగుమతి చేయవచ్చని ఒక ఎక్స్​పర్ట్​ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారతీయ కంపెనీలు ఇప్పటికే రూ. 32–-40 లక్షల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నారని తెలుస్తోంది.   గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి సరుకు రాకముందే వ్యాపారులు ఎగుమతి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారని ముంబై వరల్డ్ ట్రేడ్ సెంటర్ చైర్మన్ విజయ్ కలంత్రి అన్నారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో 40 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల ఉత్పత్తిని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.