మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగుడాలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్ద సోమవారం సాయంత్రం ఓ ఇసుక లారీ యూటర్న్ తీసుకుంటూ బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో హైదరాబాద్–వరంగల్ హైవేపై రెండు వైపులా కి.మీల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
వెంటనే వచ్చి క్లియర్ చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు చెంగిచెర్ల చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉండిపోయారు. ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తున్నామని చెప్పారే తప్ప రాలేదని ట్రాఫిక్‌లో చిక్కుకున్న జనం వాపోయారు. బ్రేక్డౌన్అయిన గంట తర్వాత పోలీసులు క్రేన్ తీసుకొచ్చి లారీని పక్కకు తీశారు.

