తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లు ఎదుటి వాళ్లపై పడితే చాలు.. కరోనా వైరస్ వ్యాపిస్తోంది. అందుకే మనసుకు ఎంత దగ్గరైన వాళ్లైనా దూరం పాటించాల్సిందే. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ అయిన వాళ్లకు దూరంగా ఉండటం, ఎంత బాధ వచ్చినా హత్తుకుని చెప్పుకోలేకపోవడం మనిషిని మానసికంగా కుంగదీస్తోంది. అందుకే కొన్ని దేశాలు దీనికొక మంచి పరిష్కారం సూచిస్తున్నాయి. అదే ‘హగ్ ఎ ట్రీ’ కాన్సెప్ట్.
మనసులో ఎంత కష్టం ఉన్నా అయిన వాళ్లను ఒక్కసారి హత్తుకుంటే.. బాధంతా క్షణాల్లో ఎగిరిపోతుంది. అలాంటిది ఇప్పుడు కరోనా కారణంగా సొంత మనుషులు కూడా దూరంగా ఉంటున్నారు. అందుకే రోజులు, నెలలు గడుస్తున్న కొద్దీ చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. దీని నుంచి బయటపడాలంటే ప్రకృతిని ఆశ్రయించడమే సరైన మార్గం. అందుకోసం చెట్లను ఫ్రెండ్స్ గా భావించి, ఒక చెట్టును హత్తుకుని మనసులోని బాధనంతా చెప్పుకుంటే ఊరటగా అనిపిస్తుందని ఇజ్రాయిల్, ఐస్లాండ్ వాసులు చెప్తున్నారు.
ఆన్లైన్ క్యాంపెయిన్
ఫిజికల్ డిస్టెన్స్ కారణంగా ఒకరికొకరు దూరంగా ఉండటంవల్ల మెంటల్ డిప్రెషన్ కు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్లోని నేచర్ అండ్ పార్క్స్ అథారిటీ సోషల్ మీడియాలో ‘హగ్ ఎ ట్రీ’ పేరుతో ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. మానసికంగా ఎవరు కొంచెం డిప్రెస్డ్ గా ఉన్నా చెట్టును హత్తుకోవాలని సూచించింది. ‘ఈ కరోనా పిరియడ్లో మేం ప్రజలందర్నీ నేచర్‌కు దగ్గర చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మనిషి బాధను తగ్గించే శక్తి ప్రకృతికి ఉంది. పచ్చని చెట్ల మధ్యకు వెళ్లి డీప్ బ్రీత్ తీసుకుని, ఒక చెట్టును ప్రేమగా హత్తుకుంటే.. తిరిగి చెట్టు కూడా ప్రేమతో మన బాధలను దూరం చేస్తుంది. దీనికోసం అపోలీనా నేషనల్ పార్క్ లో ఒక సైట్ సీయింగ్ టూర్ కూడా ఏర్పాటు చేశాం. చాలా మంది రెగ్యులర్గా వచ్చి పార్క్ లోని చెట్లను హగ్ చేసుకుంటున్నారు” అని చెప్తున్నాడు పార్క్ అథారిటీస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఓరిట్ స్టీన్ ఫీల్డ్. అథారిటీ వాళ్లు ఏర్పాటు చేసిన టూర్ లో బార్బరా గ్రాంట్ అనే మహిళ. ‘‘ప్రతి మనిషికి అయిన వాళ్ల నుంచి ఒక టచ్, హగ్ చాలా అవసరం. అది వాళ్ల మధ్య బంధాన్నిపెంచుతూ, లైఫ్ లో ముందుకెళ్లేలా చేస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తల కారణంగా నాకెంతో ఇష్టమైన మనవరాళ్లను హత్తుకోలేకపోతున్నాను. నాకు అదెంతో బాధగా ఉంది. ఇప్పుడు పార్క్‌లో చెట్లను హత్తుకుంటుంటే మనసుకు చాలా రిలీఫ్ గా ఉంది” అంటోందామె. అయితే పార్క్‌లో ప్రొటెక్టివ్ మాస్క్, జనాల మధ్య ఫిజికల్ డిస్టెన్స్, నో స్మోకింగ్, నో ప్లాస్టి క్, ట్రీస్‌ను శానిటైజేషన్ చేయడం తప్పనిసరి చేశారు అధికారులు.
ఐస్లాండ్ అడవుల్లోనూ..
‘కరోనా బ్లూస్ తో బాధపడుతున్నారా? ఇష్టమైన వాళ్లను హత్తుకోలేకపోతున్నారా? అయితే అడవులకు రండి, వచ్చి చెట్లను హత్తుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కు ఆల్ట ర్నేటివ్ గా చెట్లతో స్నేహం చేయండి’ అంటూ ఐస్లాండిక్ ఫారెస్ట్ సర్వీస్ ప్రచారం చేస్తోంది. ఐస్లాండ్ పార్క్ రేంజర్స్ తూర్పు దిక్కుల్లో ఉన్న అలోర్‌స్టా డోర్ నేషనల్ ఫారెస్ట్ లోని రోడ్లను, మట్టి దారులను క్లియర్ క్లి చేయడంలో అటవీశాఖ అధికారులు బిజీగా ఉన్నారు. అడవుల్లో నడిచేందుకు, ఒక చెట్టును ఎంచుకుని హగ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నారు. ఐస్లాండర్స్ లవ్లీ అండ్సేఫ్టీ ఎక్స్పీరియెన్స్ పొందడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది అలోర్‌స్టా డోర్ నేషనల్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్. అలాగే అడవుల్లోకి వచ్చే జనానికి కూడా కొన్ని కండిషన్లు పెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.. ఒక మనిషి హత్తుకున్న చెట్టును ఇంకొకరు నాలుగు రోజులపాటు ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎందుకంటే ఈ వైరస్ ఉడ్ (చెక్క)పై నాలుగు రోజులపాటు బతికే ఉంటుంది. ప్రకృతి ప్రేమికులంతా ఇలా అడవుల్లోకి వెళ్లి చెట్లను హత్తుకుని మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. మంచి రిలాక్సేషన్ ‘‘ఉదయాన్నే రోజును స్టార్ట్ చేసే ముందు ఒక చెట్టును హత్తుకుని చూడండి. కొత్త చాలెంజ్ లను ఎదుర్కొనేందుకు ఎంతో ఉత్సాహం వస్తుంది. చెట్టును ప్రేమగా హగ్ చేసుకుంటే, ముందు అరికాళ్లు, తర్వాత మోకాళ్లు, ఆపైన అప్పర్ బాడీ, చివరగా బ్రెయిన్‌కి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఇది నేను రోజూ ప్రాక్టికక్టిల్ గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా” అంటున్నాడు అలోర్‌స్టా డోర్ నేషనల్ ఫారెస్ట్ మేనేజర్ పోర్ ఫిన్సన్. ఈ ఫారెస్ట్ .. ఐస్లాండ్ లోని మొదటి, అతిపెద్ద నేషనల్ ఫారెస్ట్. ఇది మొత్తం 1800 ఎకరాలతో విస్తరించి ఉంది.
ఫారెస్ట్ బాతింగ్
చెట్టును కౌగిలించుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకునే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. దీన్నేఫారెస్ట్ బాతింగ్ అంటారు. అడవిలో మెల్లగా నడుస్తూ ప్రకృతి నుంచి వచ్చే గాలి పీల్చడం, చెట్లను హగ్ చేసుకోవడమే ఈ ఫారెస్ట్ బాతింగ్. ఇలా నడిస్తే ఎన్నో శారీరక ,మానసిక సమస్యలు దూరం అవుతాయి. కోపం, ఆందోళన, ఒత్తిడి, అలసట వంటి వాటికీ ఫారెస్ట్ బాతింగ్ చక్కని పరిష్కారం. దీనికోసం పచ్చని అడవి ఎంచుకోవాలి, అప్పుడప్పుడు పిక్నిక్ లాగ అడవిలో విహారానికి వెళ్లి, చెట్లను హగ్ చేసుకుంటే.. ప్రకృతి మన సమస్యలను హీల్ చేస్తుంది.

