మానవత్వం: పిల్లాడిని రక్షించేందుకు వర్షంలో 4855 మంది క్యూ

మానవత్వం: పిల్లాడిని రక్షించేందుకు వర్షంలో 4855 మంది క్యూ

అది బ్రిటన్​లోని వోర్సెస్టర్ లో ఉన్న పిట్ మాస్టన్​ ప్రైమరీ స్కూల్. వాన పడుతోంది. అల్లంత దూరాన బారెడు క్యూ ఉంది. అక్షరాలా 4,855 మంది.. వాననూ లెక్కచేయకుండా లైన్లో నిలబడ్డారు. వాళ్ల పిల్లల అడ్మిషన్ల కోసం కాదు. ఆపదొచ్చిన ఓ బుడ్డోడికి సాయం చేసేందుకు. అతడిని బతికించేందుకు. ఆ బుడ్డోడి పేరు ఆస్కార్ సాక్సెల్బీలీ. వయసు ఐదేళ్లు. అంత చిన్న వయసులోనే పెద్ద జబ్బు అతడిని పట్టింది. అక్యూట్ లిం ఫోబ్లాస్టిక్ లుకేమియా. సింపుల్ గా చెప్పాలంటే బ్లడ్ కేన్సర్ . మూడు నెలల్లో అతడికి సరిపోయే మూలకణాలతో చికిత్స చేయకపోతే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు మ్యాచింగ్ మూల కణాల కోసం వెతకని చోటంటూ లేదు.

డీకేఎంఎస్ అనే స్వచ్ఛంద సంస్థ సహాయంతో దాతల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాతల కోసం ప్రకటనలివ్వగా.. ఇదిగో ఇంత మంది జనం వచ్చారు. ఓ పసి ప్రాణాన్ని కాపాడేందుకు తమ మూల కణాలిస్తామంటూ ముందుకొచ్చారు. వాళ్లందరి రక్తం శాంపిళ్లను తీసుకుని ఆ పిల్లాడి మూలకణాలు సరిపోతాయా లేదా టెస్టు చేస్తున్నారు. అంతమందొచ్చినా అందులో ఒక్కరి స్టెమ్ సెల్స్​ కూడా ఆ చిన్నారి మూలకణాలతో మ్యాచ్​ కాకపోవడం అతడి తల్లిదండ్రులను బాధిస్తోంది. అయినా కూడా వారి ప్రయత్నాలను ఆపలేదు. ఇప్పటికే ఆ చిన్నారికి 20 సార్లు రక్తం ఎక్కించారు. నాలుగు వారాల పాటు కీమోథెరపీ చేశారు.