కూకట్ పల్లిలో దారుణం.. భార్య గొంతు కోసి చంపి.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

కూకట్ పల్లిలో దారుణం.. భార్య గొంతు కోసి చంపి.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి  ఖైతలాపూర్‌ లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఓ భర్త.. తన భార్యను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా కసాయిగా ప్రాణాలు తీశాడు.

పోలీసుల కథనం ప్రకారం.. రహీమ్, సుమేరా అనే దంపతులకు 2024 లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్ అయిన రహీమ్‌కు, అతని భార్యకు మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ వివాదాలు నడుస్తున్నాయి. రోజూలాగే ఈరోజు తెల్లవారుజామున కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ఆ వివాదం కాస్తా ముదరడంతో.. రహీమ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంలో ఊగిపోతూ, ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో భార్య సుమేరా గొంతు కోసి అక్కడికక్కడే హతమార్చాడు.

భార్యను దారుణంగా చంపేసిన అనంతరం నిందితుడు రహీమ్.. నేరుగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘోర ఘటన పైన కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సాయంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు, ఘటనకు గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని కూకట్‌పల్లి సిఐ సుబ్బారావు తెలిపారు.