కరోనాతో భర్త.. తట్టకోలేక బిల్డింగ్ పైనుంచి దూకి భార్య..

కరోనాతో భర్త.. తట్టకోలేక బిల్డింగ్ పైనుంచి దూకి భార్య..

కరోనాతో భర్త మృతి.. బిల్డింగ్ పై నుంచి దూకి భార్య సూసైడ్

హైదరాబాద్‌, వెలుగు: కరోనాతో భర్త చనిపోయాడు. తట్టుకోలేక.. భార్య బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. గురువారం మేడ్చల్‌ జిల్లా నేరెడ్‌మెట్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. సైనిక్‌పురి అబేంద్కర్‌‌నగర్‌‌కు చెందిన తడకమళ్ళ వెంకటేశ్‌(62) వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్నాడు. ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. బంధువులు, చుట్టుప్రక్కల వారు  వెంకటేశ్‌ ఇంటికి వచ్చేందుకే భయపడ్డారు. గురువారం సాయంత్రం వెంకటేశ్‌ మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ధనలక్ష్మి(55) ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్‌ డెడ్‌బాడీ ఇంట్లో ఉండగానే బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. నేరేడ్‌మెట్‌ పోలీసులు డెడ్‌బాడీలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్ట్‌మార్టమ్ తర్వాత కరోనా రూల్స్‌ ప్రకారం అంత్యక్రియలు జరిపారు.

For More News..

మక్కలు కొనకపోతే.. ఎక్కడ అమ్ముకోవాలె

ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌కు చట్టబద్ధత ఉంది.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

దసరాకు ‘ధరణి’ డౌటే! పూర్తి కాని ఆస్తుల నమోదు

మాజీ ఎమ్మార్వో నాగరాజు లాకర్లలో కిలోపావు బంగారం