వీడియో.. పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త.. కాపాడిన స్థానికులు

వీడియో.. పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త.. కాపాడిన స్థానికులు

ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్తకు పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు. చిలక కోయలపాడుకి చెందిన నవ్య, నాగేశ్వరావులు భార్యభర్తలు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి కొంతకాలంగా గొడవలు జరగుతున్నాయి. దాంతో నవ్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న నాగేశ్వరావు.. స్థానిక టీఎన్జీఓస్ కాలనీ సమీపంలో బుధవారం సాయంత్రం నవ్యను హత్య చేయడానికి ప్రయత్నించాడు. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి గొంతునులిమి చంపడానికి పూనుకున్నాడు. అయితే నవ్య అరుపులతో స్థానికులు అప్రమత్తమై.. నాగేశ్వరావు మీద రాళ్లతో దాడి చేసి నవ్యను కాపాడారు. నాగేశ్వరావును పట్టుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నాగేశ్వరావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. చికిత్స నిమిత్తం నవ్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు.