హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఈ నెల 28న పల్స్ పోలియో నిర్వహించనున్నామని, అన్ని శాఖల ఆఫీసర్లు విజయవంతం చేయాలని అడిషనల్కలెక్టర్జితేందర్రెడ్డి కోరారు. పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినం, స్టాప్ డయేరియా క్యాంపెయిన్‌లపై జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు.
జితేందర్ రెడ్డి మాట్లాడుతూ స్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లను ఆదివారం తెరిచి ఉంచాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో డాక్టర్పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ 28న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. బూత్‌లకు రాలేని వారి కోసం జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జూలై1 నుంచి 19 ఏండ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్అందజేయనున్నట్లు తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
