డిఫెన్స్, ఎయిరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ హబ్‌గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. భారత్-అమెరికా రక్షణ ఒప్పందాలపై హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో జరుగుతున్న సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…త్వరలో మరో రెండు డిఫెన్స్ ఎయిరో స్పేస్ పార్కులు సాధిస్తుందన్నారు. వరల్డ్ క్లాస్ ఎయిరో స్పేస్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.
అంతేకాదు కొత్త పరిశ్రమలకు తగిన సాంకేతిక సహకారం అందిస్తున్నామన్నారు కేటీఆర్. బోయింగ్ సంస్థతో టీ హబ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ లో సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైమానిక రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని చెప్పారు మంత్రి కేటీఆర్.

