గుడ్న్యూస్.. అరబిందో ఫార్మా నుంచి హెచ్‌‌ఐవీ మందు

గుడ్న్యూస్.. అరబిందో ఫార్మా నుంచి హెచ్‌‌ఐవీ మందు

న్యూఢిల్లీ/హైదరాబాద్: హెచ్‌‌ఐవీ ట్రీట్​మెంట్​కోసం హైదరాబాద్‌‌కు చెందిన అరబిందో ఫార్మా ఎక్కువ కాలం పనిచేసే కాబొటెగ్రావిర్  ఇంజెక్షన్లను ఉత్పత్తి చేసి, ప్రపంచవ్యాప్తంగా 133 దేశాలకు సరఫరా చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. 

మెడిసిన్స్ పేటెంట్ పూల్, వీఐఐవీ హెల్త్‌‌కేర్ మధ్య కుదిరిన  లైసెన్సింగ్ ఒప్పందం కింద, జెనరిక్ తయారీదారులలో ఒకటిగా అరబిందో ఫార్మా ఎంపికయింది.   రోజువారీ మాత్రలు తీసుకోవడానికి బదులుగా, ప్రతి ఒకటి లేదా రెండు నెలలకు ఒకసారి కాబొటెగ్రావిర్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. 

గతంలో హెచ్‌‌ఐవీ నివారణకు మాత్రమే ఉపయోగించిన కాబొటెగ్రావిర్‌‌ను ఇప్పుడు హెచ్‌‌ఐవీ ట్రీట్​మెంట్​ కోసం కూడా చేర్చడానికి ఈ కంపెనీలు ఒప్పందాన్ని విస్తరించాయి.