హైదరాబాద్ బీ అలర్ట్.. వచ్చే 6 రోజులు వర్షాలు పడే ఛాన్స్

హైదరాబాద్ బీ అలర్ట్.. వచ్చే 6 రోజులు వర్షాలు పడే ఛాన్స్

హైదరాబాద్‌లో రాబోయే ఆరు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ సూచన ప్రకారం, మే 2 న, నగరంంలో సాధారణ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇది మే3న కూడా కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

మే 4, 5 తేదీల్లో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మే 6వ తేదీన, సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణం మారుతుందని అంచనా వేస్తోంది. ఇది మే 7,8 తేదీలలోనూ కొనసాగుతుందని, హైదరాబాద్‌లో ఈ రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రోజూ వారి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 23, 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.