- ఆ స్కూల్స్లో విద్యార్థుల అడ్మిషన్స్ తక్కువ నమోదు
- కలెక్టర్ ప్రియాంక ఆల సమీక్ష
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్జిల్లాలోని తెలుగు, ఉర్దూ స్కూల్స్లో విద్యార్థుల అడ్మిషన్స్సంఖ్య తగ్గిందని కలెక్టర్ప్రియాంక ఆల అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంపై ఆసక్తి చూపుతున్నారని, అందుకే ఆయా స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంగా మార్చాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. బడిబాట ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించాలని, స్టూడెంట్స్ నమోదు ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 275 ప్రీ -ప్రైమరీ స్కూళ్లకు అనుమతులు మంజూరైనట్లు తెలిపారు.
విద్యార్థుల ఆధార్ ప్రక్రియ 59 శాతం పూర్తయ్యిందన్నారు. 24 భవిత కేంద్రాల్లో ప్రస్తుతం 431 మంది చదువుతున్నారని, వారికి స్పీచ్ థెరపిస్టులు, ఫిజియోథెరపిస్టుల ద్వారా నాణ్యమైన సేవలందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు 5,774 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలను సాధారణ స్కూళ్లలో జాయిన్చేశామని ఆఫీసర్లు కలెక్టర్‌కు వివరించారు. బడిబాట కింద 600 మంది పిల్లల్ని గుర్తించినట్లు, ఇప్పటివరకు 334 మంది బడి మానేసిన స్టూడెంట్స్ ను తిరిగి స్కూళ్లలో చేర్పించినట్లు తెలిపారు. పాఠశాలల్లో ఏఐ, డిజిటల్ లెర్నింగ్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అడిషనల్కలెక్టర్ జితేందర్ రెడ్డి, డీఈవో యాదయ్య పాల్గొన్నారు.
