రూ.20 కోట్లతో ఉప్పల్ నల్లచెరువు అభివృద్ధి

రూ.20 కోట్లతో ఉప్పల్ నల్లచెరువు అభివృద్ధి
  • త్వరలో కబ్జాలు తొలగిస్తం
  • హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ నల్లచెరువును రూ.20 కోట్లతో అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం ఉప్పల్ నల్లచెరువును కాంగ్రెస్ ఇన్​చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి కలిసి ఆయన సందర్శించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్లచెరువులో సుందరీకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చెరువు పరిసర ప్రాంతాలలో కబ్జాలను త్వరలోనే తొలగిస్తామని చెప్పారు.