హైదరాబాద్‌‌లో మూడు రోజుల్లో రూ.5 కోట్లు సీజ్‌‌.. కొనసాగుతున్న తనిఖీలు

హైదరాబాద్‌‌లో మూడు రోజుల్లో రూ.5 కోట్లు సీజ్‌‌.. కొనసాగుతున్న తనిఖీలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎలక్షన్ కోడ్ అమలులో భాగంగా పోలీసులు సోమవారం నుంచి  విస్తృత తనిఖీలు చేపట్టారు. చెక్​ పోస్టులు పెట్టి వెహికల్‌‌ చెకింగ్స్‌‌ నిర్వహించి గడిచిన మూడు రోజులుగా భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్‌‌లో జరిపిన తనిఖీల వివరాలను సీపీ సీవీ ఆనంద్‌‌ బుధవారం వెల్లడించారు. బుధవారం ఉదయం వరకు రూ.4.2 కోట్లు విలువ చేసే 7.706 కిలోల బంగారం, రూ.8.77 లక్షలు విలువ చేసే11.7 కిలోల వెండి సీజ్ చేసినట్లు తెలిపారు. బంజారాహిల్స్‌‌లో రూ.3.5 కోట్ల హవాలా డబ్బు పట్టుకున్నామని ఆయన చెప్పారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వెహికిల్‌‌ చెకింగ్స్‌‌లో అధికారులు మరో రూ. 1.6 కోట్లు నగదు సీజ్ చేశారు. వీటితో పాటు 110 లీటర్ల లిక్కర్‌‌‌‌, 43 క్వింటాళ్ల రేషన్ బియ్యం,23 సెల్‌‌ఫోన్స్ సీజ్‌‌ చేశారు.