కేసీఆర్‌ గన్‌ మెన్‌ అంటూ డబ్బులు వసూలు: ఫేక్ పోలీస్ అరెస్ట్

కేసీఆర్‌ గన్‌ మెన్‌ అంటూ డబ్బులు వసూలు: ఫేక్ పోలీస్ అరెస్ట్

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ గన్‌మెన్‌ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న  ఫేక్ పోలీసును అరెస్ట్ చేశారు వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. హైదరాబాద్ కి చెందిన సంతోష్‌ అనే వ్యక్తి ఫేక్‌ ఐడీ కార్డుతో కొన్ని రోజులుగా ఎస్సైగా చలామణి అవుతున్నాడు. ప్రస్తుతం తాను సీఎం కేసీఆర్‌ వద్ద గన్‌ మెన్‌ గా పని చేస్తున్నాని చెప్పకుంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. జౌట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబూతూ నిరుద్యోగ యువత దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. టాస్క్‌ పోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో సంతోష్‌ ను రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. అతని నుంచి నకిలీ తుపాకీ, ఫేక్‌ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.