
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ శుభవార్త తెలిపింది... ఇటీవల పెంచిన టికెట్ ధరలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో ఫేర్ డిస్కౌంట్ 2025 కింద ఈ తగ్గింపు మే 24 శనివారం నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. రీసెంట్గా పెంచిన ధరల ప్రకారం కనిష్టంగా రూ. 12.. గరిష్ఠంగా రూ. 75 లు ఉండగా.. సవరించిన ధరల ప్రకారం కనిష్టంగా రూ. 11.. గరిష్ఠంగా రూ. 69 లు రేపటి నుంచి ( మే 24) నుంచి అమల్లోకి వస్తున్నాయి.
మెట్రో ధరలు పెంచడంతో ప్రయాణికులు నుంచి వ్యతిరేకత రావడం... టికెట్ ధర తగ్గించాలని డిమాండ్ రావడంతో ఎల్ అండ్ టి మెట్రో సంస్థ పెంచిన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
రేపటి ( మే24) నుంచి అమలు కానున్న మెట్రో ధరల వివరాలు:
- రెండు కిలోమీటర్ల వరకు 11 రూపాయలు
- 2నుంచి 4 కిలోమీటర్ల వరకు 17 రూపాయలు
- 4నుంచి 6 కిలోమీటర్ల వరకు 28 రూపాయలు
- 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు 37 రూపాయలు
- 9నుంచి 12 కిలోమీటర్ల వరకు 47 రూపాయలు
- 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు 51 రూపాయలు
- 15నుంచి 18 కిలోమీటర్ల వరకు 56 రూపాయలు
- 18నుంచి 21 కిలోమీటర్ల వరకు 61 రూపాయలు
- 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు 65 రూపాయలు
- 24 నుంచి ఆపై కిలోమీటర్ల కు 69 రూపాయలు