
జై గణేషా.. జైజై గణేషా.. గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తననుంది హైదరాబాద్ సిటీ.. మరికొన్ని గంటల్లో అంటే 2025, సెప్టెంబర్ 6వ తేదీ శనివారం హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం శోభాయాత్రకు జరగనుంది. సిటీలోని గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులు నిమజ్జనం కానున్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో నిమజ్జనం కోలాహలంగా సాగనుంది.
లక్షల మంది భక్తులు ఈ వేడుకను వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలాంటి వాళ్లు రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలతో.. ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతుంది. ఈసారి ఇలాంటి ఇబ్బందులు లేకుండా కోట్ల మంది భక్తులు.. హ్యాపీగా శోభా యాత్రను చూసేందుకు హైదరాబాద్ మెట్రో స్పెషల్ సర్వీసులు నడుపుతున్నంది.
2025, సెప్టెంబర్ 6వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం ఒంటి గంట వరకు నాన్ స్టాప్ గా సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో.
సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటలకు ఫస్ట్ రైలు ప్రారంభం అవుతుంది.
సెప్టెంబర్ 7వ తేదీ అర్థరాత్రి ఒంటి గంటకు లాస్ట్ రైలు ఉంటుంది.
నాన్ స్టాప్ గా సర్వీసులు నడపనున్నట్లు ప్రకటింటించింది హైదరాబాద్ మెట్రో.
అన్ని రైల్వే స్టేషన్లలో లాస్ట్ రైలు సర్వీసు సెప్టెంబర్ 7వ తేదీ అర్థరాత్రి ఒంటి గంటకు ఉంటుంది.
సిటీలోని ఆయా ప్రాంతాల్లో జరిగే గణేష్ శోభాయాత్రను తిలకించాలనుకునే భక్తులకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. హ్యాపీ జర్నీ..