మే 10న హైదరాబాద్ లో ప్రధాని మోడీ సభ... ఈ ఏరియాల్లో పోలీసుల ఆంక్షలు..

మే 10న హైదరాబాద్ లో ప్రధాని మోడీ సభ... ఈ ఏరియాల్లో పోలీసుల ఆంక్షలు..

ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆదివారం ( మే 10 ) రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. ఈ క్రమంలో ప్రధాని మోడీ పర్యటనను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విదించారీ పోలీసులు.బేగంపేట, బోయిన్ పల్లి , మారేడ్‌పల్లి పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు నిషేధించినట్లు ప్రకటించారు పోలీసులు.

ఈ ఏరియాల్లో 10వ తేదీ అర్థరాత్రి 12:00 గంటల నుంచి 24 గంటల పాటు డ్రోన్లు, పారాగ్లైడ్లు నిషేధించినట్లు తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. ప్రధాని మోడీ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. 4 రాష్ట్రాలు, యూటీ ఎన్నికల తర్వాత, దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రూ.7,823 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంచనున్నారు మోడీ. అనంతరం తెలంగాణ బీజేపీ సికింద్రాబాద్‎లోని పరేడ్ గ్రౌండ్స్ లో తలపెట్టిన జన ఆగ్రహ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.