
హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం 36 యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
హోం ట్యూటర్ గా పనిచేస్తున్న తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇమ్రాన్(40) అలియాస్ ప్రొఫెసర్ జాకర్, మహ్మద్ ఖాదర్(27) మరో యువకుడితో కలిసి నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్నారు. పక్కా సమాచారంతో వారిద్దరిని మాసబ్ ట్యాంక్ పరిధిలోని చాచా నెహ్రూ పార్క్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ వెనక కీలక సూత్రధారి ఇమ్రాన్. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి, అమ్ముతున్నాడని విచారణలో తేలింది. విదేశాల్లో విద్యకోసం నకిలీ డిగ్రీపట్టా కోసం ఇమ్రాన్ ను కలిసిన ఖాదర్ మరో యువకుడు ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్నాడు.
2016లో బీటెక్ చదువు మానేసిన ఖాదర్, ఇమ్రాన్‌ను సంప్రదించి ఝాన్సీలోని బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం నుంచి నకిలీ బీబీఏ డిగ్రీ సర్టిఫికెట్ కోసం రూ.80వేలు చెల్లించాడని తెలుస్తోంది.
ఇమ్రాన్ ఢిల్లీకి చెందిన నజ్ఫ్‌గఢ్ నివాసి రోహన్ అలియాస్ శ్యామ్‌లాల్‌తో కలిసి ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.
ఇమ్రాన్ ఆశావహుల నుండి వ్యక్తిగత వివరాలు ,చెల్లింపులను సేకరించి వాట్సాప్ ద్వారా రోహన్‌కు పంపేవాడు. రోహన్ వివిధ విశ్వవిద్యాలయాల నుంచి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి కొరియర్ ద్వారా ఇమ్రాన్‌కు హార్డ్ కాపీలను పంపి, ఆపై వాటిని క్లయింట్‌లకు డెలివరీ చేసేవాడని పోలీసు విచారణలో తేలింది.
కేసు నమోదు చేసుకున్ పోలీసులు దర్యాప్త చేపట్టారు. పరారీలో ఉన్న రోహన్ కోసం గాలిస్తున్నరు. దర్యాప్తు కొనసాగుతోంది.