పూలు తీసుకోండి.. ట్రాఫిక్ రూల్స్ పాటించండి

పూలు తీసుకోండి.. ట్రాఫిక్ రూల్స్ పాటించండి

LB నగర్ ట్రాఫిక్ పోలీసుల అవగాహన ర్యాలీ

హైదరాబాద్ : రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా LB నగర్ ట్రాఫిక్ పోలీసులు, లయన్స్‌‌‌‌ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని పాణనియ డెంటల్ కాలేజ్‌ స్టూడెంట్స్‌‌‌‌తో కొత్తపేట్ చౌరస్తా వరకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ర్యాలీ తీశారు. స్టూడెంట్స్‌‌‌‌ ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి పూలు ఇచ్చి రూల్స్ పాటించాలని కోరారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ తాజుద్దీన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌‌‌‌ రూల్స్ పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఎల్‌‌‌‌బీ నగర్ ట్రాఫిక్ సీఐ వెంకన్న నాయక్, లయన్స్‌‌‌‌ క్లబ్ మెంబర్లు తదితరులు పాల్గొ న్నారు.