హైదరాబాద్ : శివరాంపల్లిలో 6.53 సెంటిమీటర్ల వాన

హైదరాబాద్ : శివరాంపల్లిలో 6.53 సెంటిమీటర్ల వాన

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. రాజేంద్రనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా గంటలోనే 6 సెంటిమీటర్ల వర్షం పడింది. దీంతో రోడ్లపై వరదనీరు చేరింది. ఆరాంఘర్ నుంచి చాంద్రాయణగుట్ట వెళ్లే రూట్ లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అత్యధికంగా శివరాంపల్లిలో 6.53 సెంటిమీటర్ల వాన కురిసింది. అలాగే రాజేంద్రనగర్ లో  5.45, బహదూర్ పురా 2.58,  బండ్లగూడలో1.83 సెంటిమీటర్లు కురిసింది. మంగళవారం నగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించిన వాతరావరణ శాఖ ఎల్లో అలెర్ట్ (6.45 సెంటిమీటర్ల నుంచి 11.55 సెంటిమీటర్లు కురిసే చాన్స్) జారీ చేసింది.