ఇది నిజమేనా.. : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీసుపై ఇరాన్ బాంబుల వర్షం..?

ఇది నిజమేనా.. : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీసుపై ఇరాన్ బాంబుల వర్షం..?

 ఇరాన్  సైన్యం సంచలన ప్రకటన చేసింది.  ఇజ్రాయోల్  ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్  మిస్సైల్స్ దాడి చేసినట్లు  ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)  నివేదించింది. ఆపరేషన్ ట్రూప్ ప్రామిస్ 4 లో భాగంగా ఇరాన్ అటాక్ చేసినట్లు తెలిపింది.  ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఉన్న ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు  పేర్కొంది. ప్రస్తుతం నెతన్యాహు  ఏమయ్యారో తెల్వదని తెలిపింది.  మరో వైపు  ఇరాన్ ప్రకటనను  ఇజ్రాయోల్ తోసిపుచ్చింది.  ఇరాన్‌లో ఇద్దరు సీనియర్  ఇంటిలిజెన్స్  అధికారులను చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 

ఇరాన్, ఇజ్రాయోల్ -అమెరికా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడులను తీవ్రం చేసింది.ఇరాన్ గల్ఫ్ ప్రాంతమంతా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై వరుస దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో బహ్రెయిన్లో లో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఇరాక్, కువైట్లలో నూ ఇరాన్ వైపు నుంచి దాడులు జరిగినట్లు ఆయా దేశాలు వెల్లడించాయి. అమెరికాతో అణు చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వచ్చిన కథనాలను ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ఖండించారు. ఎలాంటి చర్చలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ టెహ్రాన్ గుండెభాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని ప్రకటించింది. తెహ్రాన్ లోని నిలోఫర్ స్క్వేర్ ప్రాంతంలో జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం ఇరవై మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. 

►ALSO READ | అమెరికా X ఇరాన్ యుద్ధంలో బాంబుల సైజ్ ఎంత.. వాటి బరువు ఎంత.. ఎలాంటి బాంబులు వేస్తున్నారంటే..!

గత మూడు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ లో ఇప్పటి వరకు 555 మంది చనిపోయినట్లు రెడ్ క్రెసెంట్ సొసైటీ సోమవారం (మార్చి 02) ప్రకటించింది. ఈ యుద్ధంలో 131 నగరాలు దాడులకు గురైనట్లు పేర్కొంది. ఇరాన్ లోని కీలక నతాన్జ్ న్యూక్లియర్ ఫెసిలిటీ పేలిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో రేడియేషన్ విడుదలై తీవ్ర పరిణామాలు ఎదుర్కునే అవకాశం ఉందని ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో ప్రకటించారు. రేడియేషన్ విడుదలవుతోందన్న హెచ్చరికలతో చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.