యుద్ధం అనగానే.. అక్కడ బాంబులు పడ్డాయి.. ఇక్కడ బాంబులు పడ్డాయి అంటాం.. ఇది కామన్. మరి యుద్ధంలో ఎలాంటి బాంబులు వేస్తారు.. వాటి సైజ్ ఎంత.. వాటి బరువు ఎంత.. బాంబుల్లో రకాలు ఏంటీ.. ఎలాంటి బాంబులను ఏ విధంగా ప్రయోగిస్తారు.. ఆ బాంబుల తీవ్రత ఎంత.. ఆ బాంబులతో ఏర్పడే నష్టం ఎంత అనే వివరాలు తెలుసుకుందామా...
అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరుదేశాల పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. బాంబులు, మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్స్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై విరుచుకుపడుతుంది. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురుపిస్తుంది. అమెరికా దెబ్బకు ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాలు నామారూపాల్లేకుండా పోతున్నాయి.
అత్యంత భారీ భవనాలు సైతం క్షణాల్లో పేకమేడల్లా కుప్పకూలిపోయేంత శక్తివంతమైన ఆయుధాలను అమెరికా ప్రయోగిస్తోంది. దీంతో అమెరికా వాడే వెపన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరీ యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా ఎలాంటి బాంబు, మిస్సైళ్లు ఉపయోగిస్తుందో తెలుసుకుందాం. యుద్ధంలో అమెరికా ప్రధానంగా మోస్ట్ పవర్ ఫుల్ బంకర్ బస్టర్ బాంబులను, అధునాతన మిస్సైళ్లను ఉపయోగిస్తోంది.
GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్:
అమెరికా దగ్గరున్న అతిపెద్ద బాంబులలో GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ ఒకటి. ఈ బాంబును భూగర్భంలో ఉన్న అణు స్థావరాలను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బాంబు బరువు సుమారు 13,000 కిలోలు. భూమి లోపలికి 200 అడుగులు వరకు చొచ్చుకెళ్లి టార్గెట్‌ను ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ బాంబుకు ఉంది.
2,000-పౌండ్ల బాంబులు
భూగర్భ క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేయడానికి 2,000-పౌండ్ల బాంబులు ఉపయోగిస్తారు. B-2 స్టీల్త్ బాంబర్ల ద్వారా వీటిని టార్గెట్లపై వదులుతారు. ఈ బాంబు బరువు సుమారు 900 కిలోల వరకు ఉంటుంది.
తోమహాక్ క్రూయిజ్ మిస్సైల్స్:
లక్ష్యాలను అతి త్వరగా నాశనం చేయడానికి అమెరికా తోమహాక్ క్రూయిజ్ మిస్సైల్స్ ఉపయోగిస్తుంటుంది. యుద్ధనౌకలు, సబ్ మైరెన్ల నుంచి వీటితో దాడులు చేస్తారు. మిస్సైళ్లలోని వార్ హెడ్ బరువు 450 కిలోలు ఉంటుంది.
కామికేజ్ డ్రోన్లు:
శత్రవుల కంటికి చిక్కకుండా లక్ష్యాలను ఢీకొట్టేందుకు కామికేజ్ డ్రోన్లు ఉపయోగిస్తారు. వీటిని ఆత్మాహుతి డ్రోన్లు అంటారు. ఇవి నేరుగా లక్ష్యాన్ని ఢీకొని పేలిపోతాయి.
ఇరాన్ ఏం ఆయుధాలు ఉపయోగిస్తుందంటే..?
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా ధీటుగా బదులిస్తోంది. ఒకవైపు తమ చిరకాల శత్రువు ఇజ్రాయెల్ పై దాడి చేస్తూనే మరోవైపు మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిత్రదేశాలపై విరుచుకుపడుతుంది. దాడుల్లో ఇరాన్ తమ అమ్ములపొదిలోని షాహాబ్-3, ఎమాద్ వంటి మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగిస్తోంది. అంతేకాకుండా షాహెద్ ఆత్మహుతి డ్రోన్లను కూడా ప్రయోగిస్తోంది.
►ALSO READ | ముదురుతున్న యుద్ధం.. మరో మూడు నెలల్లో ఫిఫా వరల్డ్ కప్.. ఇరాన్ ఎంట్రీపై సస్పెన్స్
బాంబుల రకాలు.. వాటి వల్లే కలిగే నష్టం:
రక్షణ నిపుణుల సమచారాం ప్రకారం బాంబులు ప్రధానంగా 5 రకాలు.
1. సాధారణ బాంబులు: వీటిని ఫైటర్ జెట్ల ద్వారా ప్రయోగిస్తారు. ఈ బాంబుల బరువు నార్మల్‌గా 45 కేజీల నుంచి 900 కేజీలు వరకు ఉంటాయి. 150 మీటర్ల వరకు ప్రభావం చూపిస్తాయి. 30 మీటర్ల లోపు ఉన్న కాంక్రీటు కట్టడాలను ధ్వంసం చేయగలవు.
2. బంకర్ బస్టర్లు: భూగర్భంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయడానికి బంకర్ బస్టర్లు ఉపయోగిస్తారు. ఇవి దాదాపు 200 మీటర్ల లోతుకు చొచ్చుకెళ్లి లక్ష్యాలను నాశనం చేయగలవు.
3. భారీ పేలుడు బాంబులు: అణ్వాయుధాల కంటే కొంచెం తక్కువ సామర్ధ్యం ఉన్న అత్యంత శక్తివంతమైన సాధారణ బాంబులు ఇవి. ఈ బాంబుల బరువు సుమారు 8,400 కేజీలు ఉంటుంది. ఈ బాంబు పేలుడు ప్రభావం 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది.
4. అణ్వాయుధాలు: ప్రపంచంలో అత్యంత వినాశకరమైనవి అణ్వాయుధాలు. ఈ న్యూక్లియర్ వెపన్స్‌లో కూడా రకాలు ఉంటాయి. అణుబాంబు, హైడ్రోజన్ బాంబు, 10 KT బాంబు,1 మెగాటన్ను బాంబులు ఉంటాయి. ఒక్కసారి ఈ బాంబు ప్రయోగిస్తే ఆ ప్రాంతం నామారూపాల్లేకుండా పోతుంది.
5. ఇతర రకాల బాంబులు:క్లస్టర్ బాంబులు అంటే.. ఒక ప్రధాన బాంబు నుంచి వందలాది చిన్న బాంబులు విడిపోతాయి. డ్రమ్ముల్లో పేలుడు పదార్థాలు నింపి హెలికాప్టర్ల ద్వారా విసిరే బాంబులను బారెల్ బాంబులు అంటారు.
