ముదురుతున్న యుద్ధం.. మరో మూడు నెలల్లో ఫిఫా వరల్డ్ కప్.. ఇరాన్ ఎంట్రీపై సస్పెన్స్

ముదురుతున్న యుద్ధం.. మరో మూడు నెలల్లో ఫిఫా వరల్డ్ కప్.. ఇరాన్ ఎంట్రీపై సస్పెన్స్

మిడిల్ ఈస్ట్ లో మొదలైన సంక్షోభం.. ఫిఫా వరల్డ్ కప్ పై పడుతుందా..? రోజు రోజుకూ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో.. గల్ఫ్ దేశాలన్నీ మిస్సైల్స్, డ్రోన్స్ గాయాలతో ఇప్పట్లో కోలుకోలేని స్థితిలోకి వెళ్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూన్-జులై లో ఉన్న ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆడటంపై నీలినీడలు మొదలయ్యాయి. 

ముఖ్యంగా ఇరాన్ దేశం ఆడటంపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ ఫ్యాన్స్ ను వరల్డ్ కప్ కు నిషేదించారు. ఫ్యాన్స్ నే నిషేధించిన తరుణంలో ఇరాన్ దేశం పరిస్థితి ఏంటనేది మున్ముందు తెలుస్తుంది. 

మరోవైపు.. అమెరికాలో నిర్వహించబోయే టోర్నెమంట్లో తాము పాలుపంచుకోమని ఇరాన్ ఫుడ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు మెహ్దీ తాజ్ ప్రకటించారు. తమపై ఇంతటి దాడి జరుగుతున్న క్రమంలో మేము ఈ వరల్డ్ కప్ లో ఆడతామని అనుకోవటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

2026 జూన్-జులై నెలల్లో ఫుట్ బాల్ వరల్డ్ కప్ -2026 టోర్నమెంట్ అమెరికా,మెక్సికో, కెనాడాలో జరగనుంది. జూన్ 15న కాలిఫోర్నియాలోని ఇంగిల్వుడ్ లో న్యూజీలాండ్ తో ఇరాన్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత సియాటెల్ లో జూన్ 21 బెల్జియం,, జూన్ 26న ఈజిప్ట్ తో.. గ్రూప్ జీ మ్యాచెల్ లో భాగంగా ఆడాల్సి ఉంటుంది. 

►ALSO READ | Pakistan Cricket: పాక్ క్రికెటర్లకు పీసీబీ బిగ్ షాక్.. బాబర్, అఫ్రిదిలకి భారీ జరిమానా!

ట్రంప్ అధికార యంత్రాంగం ఇప్పటికే ఇరాన్ ఫ్యాన్స్ ను బ్యాన్ చేసింది. ఇరాన్ ఆడుతుందా లేదా అనే అంశంపై ఫిఫా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. 

ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతితో ఉద్రిక్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. అయినప్పటికీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఈ క్రమంలో టోర్నమెంట్ నుంచి ఇరాన్ బయటకు వస్తే.. రీప్లేస్ మెంట్ కాస్త క్లిష్టమైన పరిస్థితితే. మరోవైపు గ్రూప్ షెడ్యూల్స్ కూడా తారుమారు అయ్యే అవకాశం ఉంది. అయితే ఇరాన్ విత్ డ్రా అయితే ఆసియన్ క్వాలిఫికేషన్ ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కి ఛాన్స్  దొరికే అవకాశం ఉంది.