ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినవారిపై చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. ఇక మైనర్లకు వాహనాలు ఇచ్చే పేరెంట్స్, వాహన యజమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. గురువారం హైదరాబాద్ సిటీలో మాల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన దాదాపు 15వందల మందిపై కేసులు నమోదు చేశారు.
గురువారం సిటీలో మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసుల పరిధిలోని ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి పట్టుబడ్డ 1496 మందిపై కేసులు నమోదు చేశారు. రూ. 2.99 లక్షల జరిమానాలు విధించారు. బైకులు నడుపుతున్న 17మంది మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లను వాహనాలు నడిపేందుకు అనుమతించొద్దని పేరెంట్స్, వాహన యజమానులను హెచ్చరించారు.
►ALSO READ | నర్సింహులపేట MPDO ఆఫీస్‌లో ఏసీబీ రైడ్స్..లంచం తీసుకుంటూ దొరికిన MPDO,MPO
