నర్సింహులపేట MPDO ఆఫీస్‌లో ఏసీబీ రైడ్స్..లంచం తీసుకుంటూ దొరికిన MPDO,MPO

నర్సింహులపేట MPDO ఆఫీస్‌లో ఏసీబీ రైడ్స్..లంచం తీసుకుంటూ దొరికిన MPDO,MPO

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీఓ (MPDO) కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్యలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

ఒక పని కోసం  బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేయడంతో.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఎంపీడీవో రాధిక 25 వేల రూపాయలు, అలాగే ఎంపీవో యాకయ్య 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రంగులరాట్నంలో పట్టుకున్నారు.

►ALSO READ | ఆ కేసు మా పరిధిలోకి రాదు.. ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లాలి.. మీనాక్షి నటరాజన్ కు నాంపల్లి కోర్టు సూచన

లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్యలను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.