హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ కేసుకు సంబధించిన పిటిషన్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. పిటిషనర్ శ్రీలత దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు రీటర్న్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరపడం తమ పరిధిలోకి రాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ పిటిషన్‌లో ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్న నేపథ్యంలో దీనిని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వేసుకోవాలని పిటిషనర్ శ్రీలతకు న్యాయస్థానం సూచించింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన కోర్టు, దానిని తిరస్కరిస్తూ వెనక్కి పంపింది.
మీనాక్షి నటరాజన్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..శ్రీలత వేసిన పిటిషన్‌లో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నందున, ఈ కేసు తమ పరిధిలోకి రాదని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల కోర్టులోనే రీ-ప్రజెంట్ చేసుకోవాలని పిటిషనర్‌కు సూచిస్తూ,నాంపల్లి కోర్టు దీనిని రిటర్న్ చేసింది అని వెల్లడించారు.
►ALSO READ | హుజూరాబాద్ బీఆర్‌ఎస్ అడ్డా.. రేవంత్ రెడ్డివి అన్నీ అబద్ధపు ఆశలే: హరీశ్ రావు
సుప్రీంలోనూ దక్కని ఊరట
జూన్ 12న తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నటరాజన్ వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని పేర్కొంది. 2026 జూన్ 12న పిటిషన్ విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ లతో కూడిన బెంచ్.. పిటిషన్ ను డిస్మిస్ చేశారు.
రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ బుధవారం (2026 జూన్ 10) సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయగా.. క్రిమినల్ కేసు దాచినట్లు ఆరోపిస్తూ ఎన్నికల అధికారి నామినేషన్ తిరస్కరించారు దీనిపై ఆమె సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. తెలంగాణలో అసలు క్రిమినల్ కేసే లేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని పిటిషన్లో పేర్కొంది.
